కడప అర్బన్ : కడప నగరం రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి వేగంగా వచ్చి ఆటో ఢీకొనడంతో మణికంఠ(19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కడప వన్ టౌన్ ఎస్‌ఐ అమరనాథ్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు కమలాపురం మండలానికి చెందిన మణికంఠ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యువకుని తల్లిదండ్రులు శైలజ, గంగాధర్‌లు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఊరి నుంచి సొంత పని నిమిత్తం కడపకు చేరుకున్నాడు.
కడప రైల్వేస్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని ఆటో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్‌ఐ వెల్లడించారు.