
ఆర్థిక సౌలభ్యాలను రద్దు చేయడం తగదు
రాయచోటి జగదాంబసెంటర్ : రిటైర్డ్ ఉద్యోగులు సాధించుకున్న ఆర్థిక సౌలభ్యాలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సులభంగా తక్కువ కాల వ్యవధిలో రద్దు ఉత్తర్వులు ఇస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ గురురాజరావు పేర్కొన్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని డైట్ సభా భవనంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాయచోటి డివిజన్ యూనిట్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన గురురాజరావు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములై ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేశారన్నారు. అలాంటి పెన్షనర్లను ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అన్నమయ్య జిల్లా శాఖ అధ్యక్షుడు రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం.రెడ్డన్న, గౌరవాధ్యక్షుడిగా సీఆర్‌వీ సుబ్రమణ్యం, అసోసియేట్ అధ్యక్షులుగా మల్లికార్జున, రామతులసమ్మ, శ్రీనివాసులు, శివనారాయణరెడ్డి, రామతులశమ్మ, ప్రసాద్, జనరల్ సెక్రటరీగా రఘునాథరెడ్డి, కార్యదర్శులుగా శంకరయ్య, రమేష్‌బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టీఎంఆర్ చంద్ర, కోశాధికారి ఎన్.లక్ష్మీనారాయణలను ఎన్నుకున్నారు. తిరుపతి జిల్లా శాఖ అసోసియేట్ అధ్యక్షుడు గోపాల్, సంఘం నాయకులు సురేంద్రారెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.