
తాడేపల్లి: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రడ్డి అభినందనలు తెలియజేశారు. ‘ రాధాకృష్ణన్ జీ.. మీరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు నా అభినందనలు. దేశానికి మీరు చేసే సేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ అంకితభావం, సుదీర్ఘ అనుభవం మన దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశంగా పని చేస్తాయి అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Congratulations Shri C. P. Radhakrishnan Ji on being elected as the Vice President of India!
Wishing you all the success in your service to the Nation.
Your dedication and experience will surely guide our country.@CPRGuv pic.twitter.com/QRJ8SUEixe— YS Jagan Mohan Reddy (@ysjagan) September 9, 2025
కాగా, ఉపరాష్ట్రపతి ఎంనిక కోసం ఈరోజు(మంగళవారం సెప్టెంబర్ 9వ తేదీ) జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది.