Deputy CM Alla Nani Participated Eluru 2nd Division Municipal Election Campaign In Eluru - Sakshi
Sakshi News home page

మునిసిపల్‌ ఎన్నికలు: మంత్రి ఆళ్లనాని ప్రచారం..

Mar 6 2021 7:34 PM | Updated on Mar 6 2021 7:58 PM

YSRCP Minister Alla Nani Municipal Election Campaign In Eluru - Sakshi

ఏలూరు ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని

సాక్షి, పశ్చిమగోదావరి :  ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌‌ ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏలూరు 2వ డివిజన్‌లో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ఏలూరును ఎంతో అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఏలూరులో మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఏలూరు కార్పొరేషన్‌ను గెలుచుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ ‍జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు.

విశాఖపట్నం:  విశాఖలోని 90వ వార్డులో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ అభివృద్ధి కోసం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం వైఎస్‌ జగన్‌ది సంక్షేమ ప్రభుత్వమని, విశాఖకు త్వరలో పరిపాలన రాజధాని రాబోతోందన్నారు. భరత్‌నగర్‌లో ఇల్లు లేని 30 కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసానిచ్చారు. 

చదవండి: 

'చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదు'

మళ్లీ చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement