
నిరుద్యోగులను చంద్రబాబు నట్టేట ముంచారని వైఎస్సార్‌సీపీ స్టూడెంట్స్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. గ్రూపు-2 అభ్యర్థులకు మేలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
సాక్షి, తాడేపల్లి: నిరుద్యోగులను చంద్రబాబు నట్టేట ముంచారని వైఎస్సార్‌సీపీ స్టూడెంట్స్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. గ్రూపు-2 అభ్యర్థులకు మేలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నియమించిన ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తొలగిస్తోంది. శాశ్వత ఉద్యోగాల్లో కోతలు విధిస్తోంది. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్నవి తొలగించటం అన్యాయం’’ అని ఆయన ధ్వజమెత్తారు.
‘‘గ్రూప్-2 అభ్యర్థలను నమ్మించి వారి గొంతు కోశారు. అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామని నమ్మబలికి వారి జీవితాలను నాశనం చేశారు. ఈరోజు 92,250 మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. వారందరి జీవితాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెలగాటమాడారు. నిరుద్యోగుల జీవితాలను సీఎం చంద్రబాబు నట్టేట ముంచారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వాలి. లేకపోతే వైఎస్సార్‌సీపీ తరపున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’’ అని రవిచంద్ర హెచ్చరించారు.