సాక్షి, తాడేపల్లి: నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అని పోస్టు చేశారు.
కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయన సేవలను… pic.twitter.com/jE9De9LbIL
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2026


