శిల్పకళా వైభవానికి ప్రతీక ‘వేయిస్తంభాల దేవాలయం’ | - | Sakshi
Sakshi News home page

శిల్పకళా వైభవానికి ప్రతీక ‘వేయిస్తంభాల దేవాలయం’

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

శిల్పకళా వైభవానికి ప్రతీక ‘వేయిస్తంభాల దేవాలయం’

హన్మకొండ కల్చరల్‌: కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన వరంగల్‌ నగరంలోని వేయిస్తంభాల దేవాలయం విద్యార్థుల నిర్మాణ కళాప్రదర్శనకు వేదికై ంది. శనివారం విజయవాడ సమీపంలోని కేఎల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ విద్యార్థులు ఆలయాన్ని సందర్శించి నిర్మాణశైలి, శిల్పసంపదపై అధ్యయనం చేశారు. ఆలయప్రాంగణంలో ఆర్కిటెక్చరల్‌ షీట్లు, నమూనాలు, డాక్యుమెంటేషన్‌ డ్రాయింగ్స్‌ ప్రదర్శించారు. ఆలయ విశిష్టతను ప్రతిబింబించేలా ఫొటోగ్రఫీ, లైవ్‌ స్కెచ్చింగ్‌ నిర్వహించారు. అశోకా స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కళాత్మక నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనను ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.

దేవాలయంలో కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల నిర్మాణ కళాప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement