రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌ | YS Jagan Tours Pulivendula YSR District April 21st News | Sakshi
Sakshi News home page

రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌

Apr 20 2026 8:26 AM | Updated on Apr 20 2026 8:43 AM

YS Jagan Tours Pulivendula YSR District April 21st News

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. 

తన పర్యటనలో బాగంగా వైఎస్‌ జగన్‌ మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకుంటారు. అక్కడ భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. మరుసటిరోజు(22న) ఉదయం పులి­వెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు.

స్థానిక వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్‌ రెడ్డి ఇటీవలె మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ ఓదార్చనున్నారు. తిరిగి పులివెందుల క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని ప్ర­జాదర్బార్‌ నిర్వహిస్తారు. 23వ తేదీన ఉదయం పర్యటన ముగించుకుని పులి­వెందుల నుంచి తిరుగు పయనమవుతారు.

Advertisement
 
Advertisement
Advertisement