బరిలో బలమైన అభ్యర్థులు | YS Jagan provides guidance on the selection of YSRCP candidates for local elections | Sakshi
Sakshi News home page

బరిలో బలమైన అభ్యర్థులు

Oct 14 2026 4:29 AM | Updated on Oct 14 2026 4:29 AM

YS Jagan provides guidance on the selection of YSRCP candidates for local elections

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపికపై వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ అబ్జర్వర్లతో విస్తృత చర్చలు

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన, అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో... రెండున్నరేళ్లగా కొనసాగుతున్న దుర్మార్గ పాలన, వాటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ మరోమారు పార్టీ సీనియర్‌ నేతలతో మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. 

ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఆయన పార్టీ నాయకులతో  మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక, సమర్థంగా ఎన్నికలను ఎదుర్కోవడంపై పార్టీ రీజినల్‌ కో–ఆర్డి­నేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్లతో చర్చించారు. జిల్లాల వారీగా ఈ సమావేశాలు జరిగాయి. సంబంధిత రీజినల్‌ కో–ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్‌ అబ్జర్వర్లతో  వైఎస్‌ జగన్‌ ముఖాముఖి చర్చలు జరిపారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలను ఎదుర్కోవడంపై ఈ సందర్భంగా  పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వివిధ  కా­ర్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో వీటిపై ప్రధానంగా చర్చ జరిగింది. 

బాబు అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో రెడ్‌బుక్‌ అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని పార్టీ నేతలను వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే ప్రతిపాదిత అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూ సర్టిఫికెట్‌ విషయంలో అధికారుల ద్వారా అక్రమాలు చేయిస్తున్నారన్నారు. విశాఖలో శశికళ అనే తాజా మాజీ కార్పొరేటర్‌ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఆమెకు ఓసీ కాపుగా సర్టిఫికెట్‌ ఇవ్వడం దీనికి నిదర్శనమన్నారు.  దీనిపై పోరాడి పరిష్కారం దక్కించుకునేలోగా ఎన్నికల సమయం ముగుస్తుందని, చంద్రబాబు ఇలాంటి తప్పుడు వి­ధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. 

ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నా­రు. అన్ని అంశాలపై రీజినల్‌ కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. అసెంబ్లీ అబ్జర్వర్లు, పార్లమెంటు అబ్జర్వర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. అధికారాన్ని అ­డ్డుపెట్టుకుని చంద్రబాబు చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాల­ని, వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకు రావాలని, లీగల్‌ టీమ్‌ను అప్రమత్తం చేసి కోర్టుల ద్వారా వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే ఎన్నికల కమిషన్‌తో పాటు, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలపై బైండోవర్లు పేరిట పోలీసులు వేధింపులకు దిగుతున్న ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement