విషాదం: పిల్లల కళ్లెదుటే.. 

Woman Deceased In Road Accident - Sakshi

లారీ ఢీకొని మహిళ మృతి

గాయాలతో బయటపడిన భర్త, ఇద్దరు పిల్లలు  

రేగిడి: మండల పరిధిలోని బూరాడ జంక్షన్‌ వద్ద శనివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె భర్తతోపాటు ఇద్దరు పిల్లలు ప్రమాదం నుంచి బ యటపడ్డారు. కళ్లెదుటే తల్లిని కోల్పోవడంతో వారి రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ అలీ అందించిన వివరాల ప్రకారం.. మరడాన తిరుపతిరావు, ఆయన భార్య ఇందిర, ఇద్దరు చిన్నారులు స్కూటీపై రాజాం నుంచి వీరఘట్టం వెళ్తున్నారు. బూరాడ జంక్షన్‌ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి ఇసుక లారీ వచ్చి వాహనాన్ని ఢీకొనడంతో ఇందిర (30) రోడ్డుపై పడిపోయారు.

ఆమెపై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతిరావు ఇద్దరు పిల్లలు రోడ్డుపై పడిపోవడంతో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరగ క ముందు సాయంత్రం 4 గంటల సమయంలో రేగిడి పోలీసులు వీరి బండిని ఆపారు. అయితే వీరఘట్టంలో బంధువులు చనిపోయారని, అక్కడకు వె ళ్తున్నామని చెప్పడంతో మానవతా దృక్పథంతో వా హనాన్ని విడిచిపెట్టారు. అక్కడ నుంచి కొద్ది దూ రం వెళ్లాక ఈ దుర్ఘటన జరిగి ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయారు. వీరి స్వగ్రామం వంగర మండలం ప టువర్ధనం. బతుకు తెరువు కోసం రాజాంలో స్వీట్‌ షాపును నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. మృత దేహాన్ని రాజాం ప్రభుత్వానికి తరలించి పోస్టుమా ర్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్‌ 
కరోనా కాటు: ఒకే కుటుంబంలో ముగ్గురు బలి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top