కరోనా కాటు: ఒకే కుటుంబంలో ముగ్గురు బలి 

Three Members Of Same Family Deceased Due To Corona - Sakshi

మంత్రాలయం రూరల్‌: కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 16 రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో ముగ్గురిని కబళించింది. మంత్రాలయం సంత మార్కెట్‌లో నివాసముంటున్న చిన్న రాఘన్నశెట్టి భార్య శారదమ్మ(55) ఈ నెల ఏడో తేదీన కరోనాతో మృతి చెందింది. ఆయన మరదలు రాఘమ్మ(51) ఈ నెల 16న చనిపోయింది. చిన్న రాఘన్న శెట్టి(68) కూడా కర్నూలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  కోలుకోలేక    శనివారం మరణించాడు. ఈయన చిన్నపాటి వ్యాపారం నిర్వహించడంతో పాటు ఆర్యవైశ్య సంఘం నాయకుడిగానూ ఉండేవారు. 16 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చదవండి: కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్‌   
ఆచార్య వైసీ సింహాద్రి కన్నుమూత

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top