విశాఖ – కోరాపుట్‌ ప్యాసింజర్‌ పునఃప్రారంభం | Visakhapatnam Koraput Visakhapatnam Passenger Train Flagged Off | Sakshi
Sakshi News home page

విశాఖ – కోరాపుట్‌ ప్యాసింజర్‌ పునఃప్రారంభం

Apr 23 2022 1:28 PM | Updated on Apr 23 2022 2:45 PM

Visakhapatnam Koraput Visakhapatnam Passenger Train Flagged Off - Sakshi

విశాఖపట్నం – కోరాపుట్‌ – విశాఖపట్నం ప్యాసింజర్‌ రైలును రైల్వే మంత్రి అశ్వినివైష్టవ్‌ శుక్రవారం కోరాపుట్‌ స్టేషన్‌లో జెండా ఊపి పునః ప్రారంభించారు.

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం – కోరాపుట్‌ – విశాఖపట్నం ప్యాసింజర్‌ రైలును రైల్వే మంత్రి అశ్వినివైష్టవ్‌ శుక్రవారం కోరాపుట్‌ స్టేషన్‌లో జెండా ఊపి పునః ప్రారంభించారు. అనంతరం ఇదే రైలులో ఈ మార్గంలో స్పెషల్‌ బోగీలో విండో ఇన్‌స్పెక్షన్‌ చేశారు. గతంలో విశాఖపట్నం – కోరాపుట్‌ – విశాఖపట్నం మధ్య నడిచే డైలీ ప్యాసింజర్‌ రైలును కరోనా కారణంగా నిలిపేశారు.

ఈ క్రమంలో ప్రజల విజ్ఞప్తి మేరకు పునః ప్రారంభించేందుకు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నిర్ణయించిందని వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. శనివారం నుంచి విశాఖపట్నం–కోరాపుట్‌(08538), ఆదివారం నుంచి కోరాపుట్‌–విశాఖపట్నం (08537) రైళ్లు పాత టైమింగ్స్‌ ప్రకారమే నడువనున్నాయి.

ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం–నిజాముద్దీన్‌–విశాఖపట్నం సమతా ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం –నిజాముద్దీన్‌–విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లు త్వరలో పూర్తిస్థాయిలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తాయని తెలిపారు. సమ్మలేశ్వరి ఎక్స్‌ప్రెస్, హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్, జగదల్‌పూర్‌–రూర్కెలా–జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లకు లఖింపూర్‌ రోడ్‌ను అదనపు హాల్ట్‌గా అంగీకరించామన్నారు. ఇదే విధంగా విశాఖపట్నం – కిరండూల్‌ –విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌కు బచేలిలో అదనపు హాల్ట్‌ కేటాయించనున్నట్లు తెలిపారు. (క్లిక్: సికింద్రాబాద్‌– కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement