ఆక్సిజన్‌ కొరత.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాతృత్వం

Vallabhaneni Vamsi Donated 70 Oxygen Cylinders To Covid Hospital - Sakshi

సాక్షి, కృష్ణా: ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి.మరోవైపు కోవిడ్‌ బాధితులకు ఆక్సిన్‌ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాతృత్వం చాటకున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు వంశీ చేయూతనందించారు. రూ.30 లక్షల విలువైన 70 ఆక్సిజన్‌ సిలిండర్లు వితరణ చేశారు. చిన్నఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ కోవిడ్‌ ఆస్పత్రికి వీటిని అందజేశారు.

ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది హాస్పిటల్ యాజమాన్యానికి ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు తోట వెంకయ్య,అనగాని రవి,అన్నవరపు ఎలిజబెత్ రాణి,మేచినేని బాబు,గొంది పరందమయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆక్సిజన్‌ బెడ్ల కోసం రామ్‌కో సిమెంట్‌ రూ.20 లక్షల విరాళం ప్రటించింది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు విరాళం అందజేశారు.

చదవండి: నా అక్కచెల్లమ్మలైన నర్సులందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top