నా అక్కచెల్లమ్మలైన నర్సులందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్‌ | YS Jagan Thanks To Nurses On International Nurses Day | Sakshi
Sakshi News home page

నా అక్కచెల్లమ్మలైన నర్సులందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్‌

May 12 2021 1:52 PM | Updated on May 12 2021 6:33 PM

YS Jagan Thanks To Nurses On International Nurses Day - Sakshi

సాక్షి, అమరావతి: నేడు (బుధవారం) అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్ధంగా సేవ చేస్తూ ప్ర‌తి వారిని తమ సొంతవారిలా చూసే న‌ర్సులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఙతలు తెలియజేశారు. ఈమేరకు ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీలో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతోమందికి నిస్వార్ధంగా సేవలందిస్తున్నారు నా అక్క చెల్లమ్మలైన నర్సులు. వారందరికీ మనస్పూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.’’ అంటూ ట్వీట్‌ చేశారు.

కరోనా అనగానే అల్లంత దూరం పారిపోయే కుటుంబ సభ్యులున్న నేటి రోజుల్లో కరోనా రక్కసి చేతిలో విలవిలలాడుతున్న వారికి నర్సులు అందిస్తున్న సేవలు ఎనలేనివి. మానవ సేవే మాధవ సేవ అంటారు. అలా మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న వారు నర్సులు. అయిన వారు కూడా ముట్టుకోవటానికి ఇబ్బంది పడినా, ఏ మాత్రం సంబంధం లేని నర్సులు రోగులకు సేవలు అందిస్తున్నారు.

చదవండి: నర్సుల దినోత్సవం ఎలా మొదలైందో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement