యూపీఐ చెల్లింపుల్లో బురిడీ | Union Finance Ministry says frauds in digital payments have increased | Sakshi
Sakshi News home page

యూపీఐ చెల్లింపుల్లో బురిడీ

Apr 19 2026 5:53 AM | Updated on Apr 19 2026 5:53 AM

Union Finance Ministry says frauds in digital payments have increased

గత ఐదేళ్లలో రూ.3,889.37 కోట్ల మేర మోసం 

2025–26లో ఏకంగా రూ.1,226.37 కోట్లకు టోకరా 

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి 

సాక్షి, అమరావతి: టెక్నాలజీ ఎంత వృద్ధి చెందినా... కేటుగాళ్లకు మాత్రం చెక్‌ పడడం లేదు. వారి క్రిమినల్‌ మైండ్‌తో ప్రతిరంగంలోనూ అక్రమాలకు పాల్ప డుతూ సవాల్‌ విసురుతున్నారు. ఆ సెగ ఇప్పుడు యూపీఐ చెల్లింపులకు కూడా తాకింది. డిజిటల్‌ చెల్లింపుల్లో జెల్ల కొడుతున్నారు. ఐదేళ్లలో ఏకంగా రూ.3,889.37కోట్ల మేర మోసం జరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడించడం విస్తుగొలుపుతోంది. 

దేశంలోయూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)మోసాలు పెరిగాయి. దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్న తరుణంలో డిజిటల్‌ చెల్లింపుల్లో మోసాలు కూడా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదేళ్లలో యూపీఐ చెల్లింపుల పేరిట దేశంలో 53.67 లక్షల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. ఈ సంఘటనల్లో రూ.3,889.37 కోట్ల మేర నగదు మోసానికి గురైనట్లు పేర్కొంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 16.29 లక్షల తప్పుడు లావాదేవీలతో రూ.1,226.37 కోట్ల నగదు మోసానికి గురైంది. 

మోసాల కట్టడికి చర్యలు 
డిజిటల్‌ చెల్లింపుల్లో మోసాలను కట్టడి చేయడానికి ఏఐ–ఎంఎల్‌ ఆధారిత నమూనాలను వినియోగించి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు లావాదేవీలను తిరస్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరి్థక మంత్రిత్వ శాఖ తెలిపింది. మోసపూరిత ఖాతాలను ట్రాక్‌ చేయడానికి, బ్యాంకులు చర్యలు తీసుకోవడానికి వీలుగా అన్ని బ్యాంకులకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఫ్రాడ్‌ మానిటరింగ్‌ సొల్యూషన్లను అందిస్తున్నట్లు తెలిపింది.  

ఐదేళ్లలో యూపీఐలో దేశీయంగా జరిగిన మోసాల సంఘటనలు ఇలా..  

Advertisement
 
Advertisement
Advertisement