
రైతులను బెదిరించిన టీడీపీ వర్గీయులు ట్రాక్టర్‌తో కందిపైరు ధ్వంసం
పొదిలి రూరల్: అధికార మదంతో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. పట్టా భూముల్లో సాగు చేసిన కంది పంటను దౌర్జన్యంగా ట్రాక్టర్‌తో ధ్వంసం చేసి దున్నేశారు. ఇది తమ ప్రభుత్వమని, చెప్పినట్టు వినకపోతే ట్రాక్టర్లుతో తొక్కి చంపేస్తాం అని బెదిరించారు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని అన్నవరం గ్రామ పరిధి సర్వే నంబరు 75లో 40 ఎకరాల బీడు భూమి ఉంది. గ్రామ పెద్దలు ఆ భూమిని రెండు భాగాలుగా విడగొట్టి 20 ఎకరాలు వైఎస్సార్‌సీపీ వారికి, మరో 20 ఎకరాలు టీడీపీ వాళ్లకు సమానంగా పంచి ఇద్దరికి ఒప్పందం చేసి సాగు చేసుకోమన్నారు.
2018లో ఆ భూమికి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన 16 మంది రైతులకు అధికారులు పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చారు. సర్వేనంబరు 75లో కొత్తపులి రమణమ్మ, కొత్తపులి రమణయ్య, కొత్తపులి నాగిరెడ్డి, కొత్తపులి వెంకటేశ్వర్లు, కొత్తపులి కోటిరెడ్డి, లక్కు వెంకట లక్షి్మ, కొత్తపులి పరమేశ్వరమ్మ, కొత్తపులి సులోచన, కొత్తపులి ఓబులురెడ్డి(ఓబులేసు), కొత్తపులి నాగిరెడ్డి, కొత్తపులి ఓబులురెడ్డి (అచ్చిరెడ్డి), కొత్తపులి పెదవెంకటేశ్వర్లు, కొత్తపులి రమణమ్మ (మాలకొండయ్య), పులిబాల కోటిరెడ్డి, కొత్తపులి ఓబులురెడ్డి (ఓబులురెడ్డి), ఇతరులు ఉన్నారు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత కొందరు టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై తమకూ ఈ భూముల్లో వాటా ఉందంటూ దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం టీడీపీకి చెందిన పులి చిన నాగిరెడ్డి, వెన్నపూస చిన సుబ్బారెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి, యర్రంరెడ్డి రమణయ్య, యర్రంరెడ్డి నాగిరెడ్డి, దమ్మిడి చెన్నయ్య ట్రాక్టర్లుతో వచ్చి సర్వేనంబరు 75లో మాకు ఇంకా 10 ఎకరాల భూమి ఉందంటూ వాదనకు దిగారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన వారి పట్టా భూముల్లో కొత్తపులి వెంకటరెడ్డి సాగు చేసుకున్న 4 ఎకరాల కంది పంటను నాశనం చేశారు. విషయం తెలుసుకున్న ఈసర్వే నంబరులోని మిగిలిన రైతులు అక్కడికి వచ్చారు. తమ భూమిని ఆక్రమించుకొని టీడీపీ వర్గీయులు భయభ్రాంతులకు గురి చేశారని, అడ్డం వచి్చన వాళ్లను చంపేస్తామని బెదిరించి అసభ్యంగా దూషించినట్టు బాధిత రైతులు వాపోయారు. తమకు పట్టాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.