సీఎం చొరవతోనే మీరు ప్రాణాలతో బయటపడ్డారు

Survived With The CM YS Jagan Initiative MLA Prakash Reddy - Sakshi

చెన్నేకొత్తపల్లి: ‘సకాలంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించడం వల్లనే మీరు ప్రాణాలతో బయటపడ్డారు’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నది వరదలో చిక్కుకుపోయి సురక్షితంగా బయటపడిన 10 మందిని శనివారం ఆయన పరామర్శించారు. విషయం స్థానిక నాయకుల ద్వారా తెలిసినప్పుడు తాను అసెంబ్లీలో ఉన్నానన్నారు. వెంటనే సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో హెలికాప్టర్‌ ద్వారా రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దించారన్నారు. ప్రాణాలకు తెగించి తమిళనాడు వాసులను కాపాడేందుకు వెళ్లిన స్థానికులను, నాయకులను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం చిత్రావతిలో గంగపూజ చేశారు. 

రైతులను ఆదుకుంటాం 
వర్షాలకు దెబ్బతిన్న వరి పంట బాధిత రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి అన్నారు. ముష్టికోవెల గ్రామంలో వర్షాలకు నేలకొరిగిన వరి పంటను, దెబ్బతిన్న చెరువు కట్టను ఆయన పరిశీలించారు. తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వెల్దుర్తి సర్పంచ్‌ జీవిత, జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డి, ఎంపీపీ శ్రీశైలం ప్రవీణ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ నర్సిరెడ్డి, నాయకులు సానే జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అండగా ఉంటాం 
రామగిరి: మండల పరిధిలోని కుంటిమద్ది గ్రామంలో శనివారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పర్యటించారు. దెబ్బతిన్న ధర్మవరం–పేరూరు ప్రధాన రహదారిని పరిశీలించారు. నీటి ప్రవాహం తగ్గగానే మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జెడ్పీటీసీ నాగార్జున బాధితులకు దుప్పట్లతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుజాతమ్మ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రమేష్, సర్పంచ్‌ నరేంద్ర, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏపీఓ మృతి బాధాకరం
రాప్తాడు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో డ్వామా ఏపీఓ–2గా పనిచేస్తున్న శైలజ ఆకస్మిక మృతి బాధాకరమని ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే అనంతపురంలోని ఏపీఓ నివాసానికి చేరుకుని మృతదేహానికి నివాళులు అర్పించారు.   


రామగిరిలో నిర్వాసితులకు కూరగాయలు, దుప్పట్లు అందిస్తున్న నాయకులు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top