ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు | Southwest Monsoon Winds Have Entered Ap | Sakshi
Sakshi News home page

ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు

Jun 2 2024 3:57 PM | Updated on Jun 2 2024 4:19 PM

Southwest Monsoon Winds Have Entered Ap

సాక్షి, గుంటూరు: నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతు పవనాలు ఈ రోజు(ఆదివారం) ప్రవేశించాయని.. ఏపీ అంతటా రుతు పవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది

నేడు రాయలసీమలోకి ప్రవేశించగా, ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. అనంతరం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి.

మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభా­వంతో ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement