దీపావళి బోనస్‌ రూ.85 వేలు | Sakshi
Sakshi News home page

దీపావళి బోనస్‌ రూ.85 వేలు

Published Mon, Oct 9 2023 6:20 AM

Singareni: Diwali bonus for coal miners is Rs 85 thousand - Sakshi

సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గని కార్మికులకు ప్రొడక్షన్‌ లింక్‌ రివార్డ్‌ (పీఎల్‌ఆర్‌) దీపావళి బోనస్‌ను కోల్‌ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. కోల్‌ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్‌ అందనుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

గతేడాది దీపావళి బోనస్‌ రూ.76,500 చెల్లించగా, ఈ సంవత్సరం రూ.1.20 లక్షలు ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. చివరకు గతేడాది కంటే రూ.8,500 పెంచి రూ.85 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఈ పీఎల్‌ఆర్‌ బోనస్‌ను సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళికి వారం, పది రోజుల ముందు చెల్లిస్తుండగా, ఇతర ప్రాంతాలవారికి దసరా ముందు చెల్లిస్తున్నారు.

Advertisement
 
Advertisement