
సాక్షి, అల్లూరి సీతారామరాజు: జిల్లాలోని చింతూరు మండలంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒరిస్సాలోని భవానిపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏడుగుర్రాళ్లపల్లి మూలమలుపు వద్ద బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు.
ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 40 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. క్షతగాత్రులను ఏడుగుర్రాళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన చింతూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (మే 26న వివాహం.. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి)