బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్‌: సజ్జల

Sajjala Ramakrishna Reddy Speak About CM Jagan Priority Of BC Communities - Sakshi

సాక్షి, అమరావతి: బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ అని, బలహీనవర్గాల ఎదుగుదల కోసం ఆయన కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ సంక్షేమ పాలనను చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని అన్నారు. దుష్ప్రచారాలను మనందరం కలిసి తిప్పి కొట్టాలన్నారు. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్‌ అని గుర్తుచేశారు. గత నాయకులు బలహీనవర్గాలను ఓటుబ్యాంకుగా చూస్తే, బలహీనవర్గాల ఎదుగుదల కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. సంప్రదాయ బద్దమైన రాజకీయాలు చేసి లబ్ది కోసం కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం చూసే నాయకుడు సీఎం జగన్‌ అన్నారు.

కొంతమంది చేయలేని పనులను ముఖ్యమంత్రి జగన్‌ చేస్తుంటే రాజకీయ శూన్యంతో ఆరోపణలు చేస్తూ, పిచ్చిరాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుష్పచారాలను మనమంతా కలిసి తిప్పికొట్టాలన్నారు. బీసీల్లోని 139 కులాలకు గొప్ప అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఈ అవకాశం ఉపయోగించుకొని సామజికంగా, రాజకీయంగా ఎదగాలన్నారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సీఎం జగన్‌ ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నానని సజ్జల తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top