
సాక్షి, సత్యసాయి: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత డైరెక్షన్‌లో పోలీసులు పనిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిన విధంగా నడుచుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
వివరాల ప్రకారం.. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద హెలీకాప్టర్‌ను ప్రజలు చుట్టుముట్టారు. ఈ ఘటనలో భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పోలీసుల హైడ్రామాకు దిగారు. ఇందుకు కారణంగా.. హెలీప్యాడ్ వద్ద నిబంధనలు పాటించలేదని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం, 25 మంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను విచారణ పేరుతో రామగిరి పోలీసులు తీసుకెళ్లారు.
