480 మంది సీనియర్‌ రెసిడెంట్స్‌ నియామకానికి నోటిఫికేషన్‌ 

Notification for recruitment of 480 Senior Residents - Sakshi

23న వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతోపాటు వచ్చే ఏడాది ప్రారంభించనున్న మరో ఐదు కళాశాలల్లో 480 మంది సీనియర్‌ రెసిడెంట్స్‌(ఎస్‌ఆర్‌) నియామకానికి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎస్‌ఆర్‌లను ఎంపిక చేయనున్నారు.

వైద్య విద్య పీజీలో వచి్చన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌(ఆర్‌వోఆర్‌) ఆధారంగా పోస్టింగ్స్‌ ఇవ్వనున్నారు. వీరికి రూ.70వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. మొత్తం 21 విభాగాల్లో 480 మంది సీనియర్‌ రెసిడెంట్స్‌ను నియమించనుండగా, అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 75, అనాటమీలో 49, బయోకెమిస్ట్రీలో 39, జనరల్‌ మెడిసిన్‌లో 34 ఖాళీలు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top