Viral: Minister Perni Nani Comments On New Mutant N440K Virus In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఎన్‌440కే వైరస్‌పై ఎలాంటి నిర్ధారణ జరగలేదు: పేర్ని నాని

May 6 2021 2:42 PM | Updated on May 6 2021 7:37 PM

No Confirmation Of N440K Covid virus In Andhra Pradesh: Perni Nani - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కంటే టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత ప్రమాదకారి అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు శక్తికి మించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందని ప్రశంసించారు. చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో కొత్త వైరస్‌ ఉందని అబాండాలు వేస్తున్నారని, ఎన్‌440కే వైరస్‌పై ఎలాంటి నిర్ధారణ జరగలేదని స్పష్టం చేశారు. దేశంలో B.1.617 మినహా కొత్త రకం వైరస్‌ ఎక్కడా లేదని అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌, బెడ్స్‌, రెమిడివిసిర్‌ అన్నీ అందుబాటులో ఉంచామని తెలిపారు.

'సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని శక్తులను ఒడ్డి కరోనాకు ఎదుర్కొంటుంటే..చంద్రబాబు మాత్రం తన కొడుకు భవిష్యత్తు కోసం కరోనా సమయంలోనూ రాజకీయాలను చేస్తున్నాడు. మన రాష్ట్రం పరువును చంద్రబాబు బయట రాష్ట్రాల ముందు తీస్తున్నారు .చంద్రబాబుకు ఈ రాష్ట్రంపై ఎందుకీ కక్ష.?కొడుకు భవిష్యత్తు కోసం ఇంత దిగజారాలా? ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి రొచ్చు రాజకీయాలు చేస్తున్నారు. బెడ్స్ కాళీ ఉండటం ముఖ్యమా..? కాళీ బెడ్స్ పేషంట్ లకు ఇవ్వడం ముఖ్యమా? నువ్వు దిగిపోయెప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పరిస్థితి ఏమిటి? కనీసం ఒక్క వైరాలజీ లాబ్ పెట్టావా?ఆక్సీజన్ కోసం కేంద్రాన్ని ఒక్కసారైనా ప్రశ్నించావా?' అంటూ చంద్రబాబు తీరును ఎండగట్టారు. 

సింగపూర్ నుంచి కూడా ఆక్సీజన్ తెప్పిస్తున్నామని, అన్ని రాష్ట్రాలు చిన్న వాడైనా జగన్ ని ప్రసంసిస్తుంటే నువ్వు విషం కక్కుతున్నావ్ చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు. ఇప్పటి వరకు అన్ని విడుతలు కలిపి 67 లక్షల మందికి వాక్సిన్ వేశామని, WHO కూడా వాక్సిన్ వేయడానికి పూర్తి సామర్థ్యం ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పిందన్న విషయాన్ని గుర్తుచేశారు. 

చదవండి: రిజర్వేషన్లు: 50% పరిమితి ఎలా వచ్చింది? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement