ఏపీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక ఆదేశాలు | Nhrc Is Serious About Food Poisoning Incidents In Ap | Sakshi
Sakshi News home page

ఏపీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక ఆదేశాలు

Aug 23 2024 4:06 PM | Updated on Aug 23 2024 5:32 PM

Nhrc Is Serious About Food Poisoning Incidents In Ap

ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది.

సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. అనకాపల్లి అనాథా శ్రయంలో ముగ్గురు విద్యార్థుల మృతి చెందగా, 37 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. మరో ఘటనలో చిత్తూరు అపోలో ఆసుపత్రిలో 70 మంది విద్యార్థులు విషాహారం తిని అస్వస్థత గురయ్యారు.

ఈ కేసులను జాతీయ మానవ హక్కుల సంఘం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీ , డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో నివేదిక పంపాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వానికి NHRC నోటీసులు వరుస ఘటనలపై సీరియస్

Advertisement
 
Advertisement
Advertisement