Coronavirus Updates, 8110 New Covid Cases Recorded In AP June 10 - Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 8,110 కరోనా కేసులు

Jun 10 2021 4:37 PM | Updated on Jun 10 2021 5:55 PM

New Coronavirus Positive Cases Recorded Ap June 10 - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 97,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,110 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 67 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,763 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 12,981 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 77 వేల 063 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 99,057 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,01,37,627 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు వివరాలు.. శ్రీకాకుళం- 461, విజయనగరం- 280, విశాఖ- 502 ,తూ.గో- 1,980, ప.గో- 837, కృష్ణా- 339, గుంటూరు- 520, ప్రకాశం- 711, నెల్లూరు- 391, చిత్తూరు- 974,వ అనంతపురం- 960, కర్నూలు- 338, వైఎస్ఆర్ జిల్లా- 582 కేసులు నమోదయ్యాయి.

చదవండి: టెస్టులు, వ్యాక్సిన్‌లో ఏపీ సరికొత్త రికార్డు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement