ప్రాణం పోతది స్వామి.. లోన్‌ యాప్‌ జోలికి పోమాకు..

Nellore Police innovative campaigns On Loan App - Sakshi

► ‘అన్నా.. లోన్‌ యాప్స్‌ జోలికి పోకే.. ఆళ్లు జలగ లెక్క.. నీ రత్తాన్ని పీల్సి పీల్సి పాణం తీస్తారన్నా..’ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో హీరో బాలికను కలిసి తిరిగి వెళ్లేప్పుడు వచ్చే సీన్‌ ఇలా మీమ్‌గా మారింది.  

► ఏ శ్రీవల్లి ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లో అప్పు చేసి పట్టీలు కొన్నానే..  
ప్రాణం పోతది స్వామి.. లోన్‌ యాప్‌ జోలికి పోమాకు.. పుష్ప సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సంభాషణను ఇలా మార్చారు.. 

► ‘తల్లి : ఒరే.. లోన్‌ యాప్‌లో అప్పు చేసి గోల్డ్‌ తీసివ్వరా..  
హీరో : లోన్‌ తీసుకుంటే మనకు చుక్కలే కనిపిస్తాయి అమ్మా..’ రఘువరన్‌ బీటెక్‌ సినిమాలో తల్లీకొడుకుల మధ్య జరిగిన సీన్‌ ఇలా మీమ్‌గా మారింది.

నెల్లూరు(క్రైమ్‌): సోషల్‌ మీడియాలో మీమ్స్‌ చాలా ఫేమస్‌. సినిమాల్లోని గుర్తుండిపోయే సీన్లను సమకాలిన అంశాలకు తగినట్లుగా మీమ్స్‌గా మారుస్తుంటారు. వాటిలో కొన్ని చూడగానే నవ్వొస్తుంది. మరికొన్ని ఆలోచింపజేస్తుంటాయి. చాలామంది వాటిని షేర్‌ చేస్తుంటారు. జిల్లా పోలీస్‌ శాఖ సైబర్‌ నేరాలపై వినూత్న ప్రచారానికి తెరలేపింది. ప్రజలు లోన్‌ యాప్స్‌ వలలో చిక్కుకోకుండా అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అందులో మీమ్స్‌ ద్వారా ప్రచారం ఒకటి. 

సైబర్‌ నేరాల విషయంలో.. 
సైబర్‌ నేరగాళ్లు అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఫేక్‌ లింకులు పంపి, ఓటీపీలు అడిగి అందిన కాడికి దోచేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో కేసులు పోలీసు రికార్డులకెక్కుతున్నాయి. నిందితులు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో పోలీసులు వారిని పట్టుకోలేకపోతున్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసు ఉన్నతాధికారులు చెబుతూనే ఉన్నారు. కాగా ఇప్పటికే నేరం జరిగిన వెంటనే 1930, సైబర్‌మిత్ర 9121211100, సైబర్‌క్రైమ్‌.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌తో పాటు స్థానిక పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కలి్పస్తున్నారు.  

కొంతకాలం క్రితం..
జిల్లాకు చెందిన ఓ మహిళ లోన్‌ యాప్‌లో రూ.2,500 నగదు తీసుకున్నారు. యాప్‌కు సంబంధించిన ఓ వ్యక్తి ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.70,000 వరకు కట్టించుకున్నాడు. అయితే ఇంకా బాకీ ఉందని వేధించాడు. ఆమెను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.  

ఫేస్‌బుక్‌లో పేజీ పేరు : నెల్లూరు పోలీస్‌ 
ఫాలోవర్ల సంఖ్య : 49,000 

లోన్‌ యాప్స్‌పై..
ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్స్‌. ఇటీవలి కాలంలో యాప్స్‌ నిర్వాహకుల ఆగడాలు ఎక్కువయ్యాయి. తక్కువ మొత్తం అప్పు ఇచ్చి ఎక్కువ నగదు కట్టించుకోవడం.. కట్టలేని వారిని బెదిరించడం జరుగుతోంది. ఫొటోలను మారి్ఫంగ్‌ చేసి కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉండేవాళ్ల వాట్సాప్‌ అకౌంట్‌కు పంపుతున్నారు. ఈ యాప్స్‌ వల్ల అధికశాతం మంది మోసాలు, వేధింపులకు గురవుతుండడంతో పోలీస్‌ శాఖ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినిమాల్లోని పాపులర్‌ సీన్లతో మీమ్స్‌ చేసి ఫేస్‌బుక్‌లోని నెల్లూరు పోలీస్‌ పేజీలో తదితర వాటిల్లో పోస్ట్‌ చేస్తున్నారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఈ పోస్టులు ఉంటున్నాయి. దీంతో వాటిని బాగా షేర్‌ చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top