సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భువనేశ్వరి అనే ఓ తల్లి తన ముగ్గురు చిన్నారులకు విషం ఇచ్చింది. అనంతరం తాను కూడా విషం తాగి ఆత్యహత్యాయత్నం చేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆ మహిళ అత్త అపస్మారక స్థితిలో ఉన్న ఆ నలుగురిని చూసి షాక్‌కు గురయింది. స్థానికుల సహాయంతో వెంటనే వారిని కడప రిమ్స్ (RIMS) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి , ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం నెలకొంది.


