రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన!

Modi Laid Foundation Stone Of Projects Worth Over Rs 10500 cr - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  ఆంధ్రప్రదేశ్‌లో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) గ్రౌండ్స్‌లో శనివారం జరిగే బహిరంగ సభా వేదికగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ పాల్గొననున్నారు. 

ప్రాజెక్టుల వివరాలు..
 రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు

► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే

► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం

► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు

► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన

► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం

► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్‌జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం

ఇదీ చదవండి: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top