శ్రావణం వరకూ మోగని పెళ్లి బాజాలు | No Auspicious Dates For Marriage And House Entrances Untill 7th August, More Details Inside | Sakshi
Sakshi News home page

శ్రావణం వరకూ మోగని పెళ్లి బాజాలు

Jun 10 2024 12:08 PM | Updated on Jun 10 2024 1:05 PM

Marriage or auspicious work after 7th August

    ముహూర్తాలకు మూఢం అడ్డంకి 

    జూలై 8 వరకూ శుక్ర మూఢం 

    ఆపై ఆషాఢం శూన్యమాసం 

    ఆగస్టు 7 తర్వాతే వివాహాలు,  ఉపనయనాలు, గృహ ప్రవేశాలు 

    మళ్లీ సెపె్టంబర్‌ 4 నుంచి అక్టోబర్‌ 3 వరకూ శూన్యమాసం   

కొవ్వూరు: ఈ ఏడాది ఆగస్టు ఐదో తేదీ వరకూ పెళ్లి బాజాలకు బ్రేక్‌ పడింది. ఏప్రిల్‌ 28 నుంచి వరుసగా మూఢమి రావడంతో రెండున్నర నెలలుగా వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు నిలిచిపోయాయి. క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్‌ తొమ్మిదో తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభమై 26వ తేదీ చైత్ర మాసం వరకూ శుభ ముహూర్తాలు నడిచాయి. 

ఏప్రిల్‌ 28వ తేదీ చైత్ర చవితి ఆదివారం నుంచి జూలై ఎనిమిదో తేదీ వరకూ ఆషాఢ శుద్ధ తదియ వరకూ శుక్ర మౌఢ్యమి (మూఢం) నడుస్తోంది. మే 7 నుంచి చైత్ర బహుళ చతుర్ధశి మంగళవారం నుంచి జూన్‌ ఏడో తేదీ వరకూ గురు మౌఢ్యమి నడిచింది. వరుసగా గురు, శుక్ర మౌఢ్యములు రావడంతో రెండు నెలలుగా వివాహాలకు ఆటంకం ఏర్పడింది. మరో వైపు జూలై ఐదో తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఆషాఢ మాసం ఆగస్టు ఐదో తేదీ వరకూ కొనసాగుతుంది. ఇది శూన్యమాసం కావడంతో ఈ ¯ðనెలలో కూడా వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు నిర్వహించరు. 

మొత్తం మీద ఏప్రిల్‌ 28 నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకూ పెళ్లి బాజాలు మోగే అవకాశం లేదని పండితులు, పురోహితులు చెబుతున్నారు. మూఢంలో కేవలం అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, నూతన వ్యాపారాల ప్రారంభోత్సవాలు, సీమంతాలు, రిజి్రస్టేషన్ల వంటి పనులకు మౌఢ్యమిలోని మంచి రోజుల్లో చేసుకోవచ్చునని పండితులు సూచిస్తున్నారు. సెపె్టంబర్‌ నాలుగో తేదీ నుంచి అక్టోబర్‌ మూడో తేదీ వరకూ బాద్రపదం కూడా శూన్యమాసం కావడంతో ఈనెలలో వివాహాల ముహూర్తాలు ఉండవు.  

శ్రావణ మాసంలోనే.. 
శ్రావణ మాసం ఆగస్టు ఏడో తేదీ నుంచి ప్రారంభమై 28వ తేదీ వరకూ నడుస్తుంది. ఈ నెలలోనే దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆగస్టు ఏడో తేదీ నుంచి 28 వరకూ ముహూర్తాలు ఉన్నాయి. వాటిలో 5,12,13,19, 20, 26, 27 తేదీల్లో శుక్ర, మంగళవారాలు మినహా అన్నీ రోజులూ దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

వందలాది మంది ఉపాధికి గండి 
గత రెండున్నర నెలలుగా వివాహ ముహూర్తాలకు మూఢాలు అడ్డంకి కావడంతో వందలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. కేవలం వివాహాలపై ఆధారపడి ఎన్నో వృత్తుల వారు జీవనం సాగిస్తున్నారు. కల్యాణ మండపాలు, కేటరింగ్, వంటవాళ్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్స్, ట్రావెల్స్‌ కార్లు, బస్సులు, ఐస్‌క్రీమ్‌లు, మినరల్‌ వాటర్స్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లు, పూలు, డెకరేషన్స్, లైటింగ్, కూరగాయలు, కిరాణా, వస్త్ర, బంగారు, వెండి వ్యాపారాలు, షామ్యానాలు, మాంసపు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సాంస్కృతిక కళాకారులకు పని లేకుండా పోయింది. మరెంతో మంది రోజువారీ కూలీలకూ ఉపాధి కొరవడింది. అడపాదడపా చిన్నచిన్న ఫంక్షన్లు వస్తున్నా పెళ్లిళ్లు అయితే సరైన గిరాకీ లభిస్తుందని ఆయా వర్గాల వారు చెబుతున్నాయి.ఆగస్టు ఏడో తేదీ వరకూ మళ్లీ ఎదురు చూపులు చూడాల్సిందేనని పేర్కొంటున్నారు.

శ్రావణంలో దివ్యమైన ముహూర్తాలు 
గురు, శుక్ర మౌఢ్యాలు వరుసగా రావడంతో వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాలు 70 రోజుల పాటు నిలిచిపోయాయి. ఏప్రిల్‌ 28 తర్వాత వివాహాలకు ఇంత వరకు మళ్లీ ముహూర్తాలు లేవు. శ్రావణ మాసంలో ఆగస్టు 7 నుంచి 28 వరకూ నాలుగైదు రోజులు మినహా దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి.సెప్టెంబర్‌లో మళ్లీ భాద్రపద మాసం శూన్యమాసం కావడం వలన వివాహ ముహూర్తాలు ఉండవు. 
– వారణాసి హనుమంతశర్మ, రాష్ట్ర పురోహిత సంఘం అధ్యక్షుడు, కొవ్వూరు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement