త్వరలో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ | Kodali Nani Comments On One Year Of Grama ward Secretariats | Sakshi
Sakshi News home page

5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ: కొడాలి నాని

Oct 2 2020 1:22 PM | Updated on Oct 2 2020 1:27 PM

Kodali Nani Comments On One Year Of Grama ward Secretariats - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'స్థానికంగా ఉ‍న్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి కలగడంతో పాటు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేది సచివాలయ వ్యవస్థ.

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయాలలో అన్ని కార్యక్రమాలను అమలు చేయనున్నాం. త్వరలో గ్రామ సచివాలయాల పరిధిలోనే భూమి రిజిస్ట్రేషన్లు ప్రక్రియను ప్రారంభిస్తాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం. ఇది రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా ఉంటుంది. (ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి: దేవినేని అవినాష్‌)

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పటం, దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ దిశగా ఆలోచన చెయ్యాలని చెప్పటం మనకు గర్వకారణం. గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బందికి ప్రతి మూడు నెలలకు పరీక్ష పెట్టి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చెయ్యనున్నట్లు మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.  (మహాత్ముని అడుగుజాడల్లోనే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement