మదనపల్లి: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ మేరకు ఆరుగురు నిందితుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 15 రోజుల పాటు రిమిండ్ విధించారు. దాంతో ఆరుగురి నిందితుల్ని సబ్ జైలుకు తరలించారు. ఈ రోజు(ఆదివారం) మదనపల్లి ఏరియా ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. ఈ కేసులో ఆంజనేయులు, బాల రంగడు, మహరాజ్, పిల్లి పద్మా, సత్య, సూరిబాబులు ప్రధాన నిందితులుగా ఉన్నారు.
కాగా, మంగళవారం( నవంబర్ 11వ తేదీ) మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడిన సంగతి తెలిసిందే. మహిళలను విశాఖ నుండి మదనపల్లికి తీసుకొచ్చి కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం రేపింది యమున అనే మహిళ మిస్సింగ్ కేసు ఎపిసోడ్‌తో కిడ్నీ రాకెట్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఆమె భర్త మధుబాబు 112 తిరుపతికి కాల్ చేయగా, మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ జరిగినట్లు గుర్తించి ఫోటోలు పోలీస్ స్టేషన్‌కు ఎండార్స్ చేశారు పోలీసులు.
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున మొబైల్‌ను ట్రేస్ చేశారు పోలీసులు. దాంతో గ్లోబల్ హాస్పిటల్‌లో పద్మ కిడ్నీలను తొలగించే సమయంలో ఆమె మృతి చెందిన విషయం బయటపడింది. ఇద్దరు మహిళలను మదనపల్లి గ్లోబల్ ఆస్పత్రికి తీసుకురాగా, యమున అనే మహిళకు కిడ్నీ తొలగిస్తున్న సమయంలో మృత్యువాడ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి గ్లోబల్ ఆస్పత్నిని సీజ్ చేయడంతో పాటు రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. పలువుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు.


