6న విదేశీ నిపుణుల బృందం పోలవరం పర్యటన | International Experts visited Polavaram From November 06 | Sakshi
Sakshi News home page

6న విదేశీ నిపుణుల బృందం పోలవరం పర్యటన

Nov 5 2024 4:45 AM | Updated on Nov 5 2024 4:45 AM

International Experts visited Polavaram From November 06

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు పను­లను ఈనెల 6వ తేదీన విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో మకాం వేసి పనులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జలవనరుల శాఖ, బావర్, మేఘ ఏజెన్సీ ప్రతి­నిధులు, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీ­లించి వివరాలు తెలుసుకోనున్నారు.

ప్రస్తు­తం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య సీపేజ్‌ వాటర్‌ తొలగించే పనులు జరుగు­తున్నాయి. నీటిని తొలగించిన ప్రాంతంలో శాండ్‌ ఫిల్లింగ్‌ పనులు చేస్తున్నారు.  బృందం సభ్యులు  కొత్త డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణంపై చర్చించిన అనంతరం తుది నివేదిక తయారు చేస్తారని అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement