వరదనీటిలో హీరో శర్వానంద్‌ తాతయ్య ఇల్లు 

Hero Sharwanand Grandfather House In Flood Water - Sakshi

సాక్షి, అవనిగడ్డ: భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్‌ మైనేని హరిప్రసాద్‌కు చెందిన ఇల్లు కృష్ణానది వరద నీటిలో కొట్టుకుపోయింది. సినీ నటుడు శర్వానంద్‌కు హరిప్రసాద్‌ తాతయ్య కావడంతో గతంలో గ్రామానికి వచ్చినప్పుడు శర్వానంద్‌ ఇదే భవనంలో గడిపేవారు. అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా మైనేని హరిప్రసాద్, సినీ నటుడిగా శర్వానంద్‌ గుర్తింపు కలిగిన వారు కావడంతో వారికి చెందిన భవనం వరదల్లో కొట్టుకుపోతుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ ఇంటి పరిసరాల్లో నిలబడి ఒకింత ఆవేదనకు గురయ్యారు. గత ఏడాది సంభవించిన వరదల్లో శర్వానంద్‌ ముత్తాతకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకుపోయింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top