
శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామ రైతుసేవా కేంద్రం ఆవరణలో రైతుల పడిగాపులు
రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ
సాక్షి, నెట్‌వర్క్ : యూరియా కోసం అన్నదాతల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. సోమవారం పీఏసీఎస్‌లు, రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. అయినా అందరికీ అందని దుస్థితి. మరికొన్ని చోట్ల రైతులు ఆందోళనలు నిర్వహించారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గంలో రైతులు ఎండనక, వాననక వేచి చూస్తున్నా బస్తా యూరియా దొరకడం లేదు.
టెక్కలిలో ఉదయం 7 గంటల నుంచి రైతులంతా ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద నిరీక్షిస్తూ కనిపించారు. వానలో తడుస్తూ, కాళ్లు నొప్పులు పుట్టేలా నిలబడాల్సి వచ్చింది. నరసన్నపేటలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. బూర్జ మండలంలో రైతులకు టోకెన్లు పంపిణీ చేయడంతో రైతు సేవా కేంద్రాల వద్ద చాంతాడంత క్యూ కనిపించింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న గొల్లప్రోలు మండల రైతులు సోమవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత తమను వేధిస్తోందని అయినప్పటికీ ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మెయిన్ రోడ్డుపై రైతులు ర
కేంద్రం అదనపు యూరియా కేటాయించాలి: ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో తీవ్ర యూరియా కొరతను పరిష్కరించేందుకు తక్షణం కేంద్ర ప్రభుత్వం అదనపు కేటాయింపులు జరపాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ స్టేట్ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు.
ఈ వీడియోలో ఆయన ఏమన్నారంటే.. ‘‘యూరియా కొరత అవాస్తవమనీ, ఎవరైనా ఇలాంటి ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రంలో ఏ పీఏసీఎస్, ఆర్బీకేల వద్దకు వెళ్ళి చూసినా, యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో వేచి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ప్రైవేటు వ్యాపారులు తమ వద్ద ఉన్న నానో యూరియా, పురుగుమందులు కొంటేనే యూరియా అమ్ముతామంటూ రైతులను వేధిస్తున్నారు. కొరతను ముందుగానే గమనించి కేంద్రం నుంచి అదనపు కేటాయింపులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.’’ అని నాగిరెడ్డి విమర్శించారు.