
సంఘీభావం తెలుపుతున్న నాయకులు
ఈ నెల 15లోగా సమస్యలు పరిష్కరించాలి
విద్యుత్ ఉద్యోగుల హెచ్చరిక
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె తప్పదని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. విజయవాడలో కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులతో ఉద్యమ కార్యాచరణ గురించి రౌండ్‌టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. అక్టోబర్ 14న వర్క్ టు రూల్ పాటిస్తామని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ పి.సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.
విద్యుత్ సంస్థల్లో 27 వేల మంది కాంట్రాక్టు కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 1999 ముందు నియామకమైన ఉద్యోగులకు మాత్రమే పెన్షన్ సౌకర్యం ఉందని, తర్వాత వారికి పెన్షన్ సౌకర్యం లేదన్నారు. ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు నగదు రహిత మెడికల్ కార్డు ఇవ్వాలన్నారు. జేఎల్‌ఎం గ్రేడ్–2 ఉద్యోగులకు ఏపీఎస్‌ఈబీ సరీ్వస్ రూల్స్ వర్తింప చేయాలని సమావేశంలో తీర్మానించింది.