Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే!

Eenadu Ramoji Rao Fake News On YS Jagan Govt - Sakshi

ప్రభుత్వ మేలును వక్రీకరించేందుకే విషం కక్కుతున్న ఈనాడు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 30 లక్షలకు పైగా పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని సీఎం జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తోంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా పూరిళ్లు, గుడిసెలు, అద్దె ఇళ్లలో మగ్గిన పేదలకు సొంతిళ్లు సమకూరుతున్నాయి. దీన్నిచూసి టీడీపీకి రాజకీయ భవిష్యత్‌ ఉండదని ఎల్లోమీడియా ఈ పథకంపై తొలి నుంచి విషం కక్కుతోంది.

ప్రభుత్వం చేస్తున్న మేలును కప్పిపుచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు పత్రికలో రామోజీరావు పిచ్చిరాతలు ప్రచురిస్తున్నారు. ఇదే క్రమంలో ‘పల్లె పేదలకు ఒక్క ఇల్లూ కట్టలేదు’ అంటూ సోమవారం కూడా తన అక్కసును వెళ్లగక్కింది. పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న సాయం నామమాత్రమేనంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలో పథకం ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం చేస్తున్న మేలును ఓసారి పరిశీలిస్తే..

రూ.56 వేల కోట్లతో స్థలాల పంపిణీ
పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఉచితంగా స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేపట్టింది. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ భూమి విలువ రూ.వేల కోట్లలో ఉంది. ప్రభుత్వ భూములతో పాటు, ప్రైవేట్‌ భూములను సేకరించి ఏకంగా 71,811.9 ఎకరాల భూమిని నిరుపేదలైన మహిళల పేరిట పంపిణీ చేశారు. ఈ భూమి మార్కెట్‌ విలువ రూ. 56,102.91 కోట్ల మేర ఉంటోంది.

ఉచితంగా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల విలువ మార్కెట్‌లో రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల మేర ఉంది. ఇదే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా పంపిణీ చేసిన దాఖలాల్లేవు. సొంతంగా స్థలాలు ఉన్న వారికి మాత్రమే ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. ఇలాంటి చంద్రబాబు లీలలేవీ ఈనాడు రామోజీరావుకు కనపడవు.

యూనిట్‌ కాస్ట్‌ రూ.1.80 లక్షలకు అదనంగా రూ.90వేలు..
ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చింది. ఇందులో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కాగా, మిగిలినవి సాధారణ ఇళ్లు. సాధారణ ఇళ్ల నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ఇస్తున్నారు. దీనికి అదనంగా రూ.90 వేల వరకు ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి మేలు చేకూరుస్తోంది.

పావలా వడ్డీకి రూ.35 వేలు బ్యాంకు రుణం ఇవ్వడంతో పాటు, ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించడం ద్వారా రూ.15వేలు, మార్కెట్‌ ధరల కన్నా తక్కువకు నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడం ద్వారా మరో రూ.40వేల మేర ప్రభుత్వం లబ్ధిచేకూరుస్తోంది. ఈ లెక్కన ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.7 లక్షల చొప్పున పేదలకు మేలు చేస్తోంది.

రూ.36వేల కోట్లతో సదుపాయాలు..
పేదలకు ఉచిత స్థలాల పంపిణీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 17వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్తగా ఊళ్లనే సీఎం జగన్‌ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా ఏర్పా­­టయ్యే కాలనీల్లో సదుపాయాల కల్పనకు రూ.36,026 కోట్లు ఖర్చుచేస్తున్నారు. కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు నీరు, విద్యుత్‌ సరఫ­రా­కు, అప్రోచ్‌ రోడ్‌లు ఇతర సదుపాయాల కల్పనకు రూ.3,117 కోట్లు ఖర్చు పెట్టగా, మిగిలిన రూ.32,909 కోట్లతో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.

శాశ్వత సదుపాయాల కల్పనలో భాగంగా నీటి సరఫరాకు రూ.4,128 కోట్లు.. వి­ద్యుత్, ఇంటర్నెట్‌కు రూ.7,989 కోట్లు, డ్రైనేజీ వ్య­వస్థకు రూ.7,227 కోట్లు, రోడ్లు, ఆర్చ్‌ల నిర్మాణా­నికి రూ.10,251 కోట్లు, పట్టణాల పరిధిలోని కాలనీల్లో సదుపాయాల కల్పనకు రూ.3,314 కోట్లు కేటాయించారు. పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత మేలు చేస్తున్నా రామోజీ అక్కసు తీరడంలేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top