నరికిన కొమ్మకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు

Edupugallu: Cut Tree Branches Fruiting Mangoes in Krishna District - Sakshi

కత్తివేటుకు ఒరిగిన కొమ్మే పట్టుగొమ్మై ఫలించింది. మామిడికాయలు విరగకాసింది. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఉపాధ్యాయుడు పర్వతనేని వెంకట శ్రీనివాస్‌ వ్యవసాయ క్షేత్రం ఈ అద్భుతానికి వేదికైంది. ఇక్కడ 40 ఏళ్ల క్రితం నాటిన దేశవాళీ మామిడి చెట్ల కొమ్మలను కొంతకాలం క్రితం నరికించారు. ప్రస్తుతం ఆ నరికిన కొమ్మకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు విరగకాసి అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఉద్యానవన శాఖాధికారులు, రైతులు ఈ చెట్లను తిలకించారు. 
–కంకిపాడు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top