కట్టుకట్టి వదిలేశారు | Doctors are connecting with Arogyashri even for minor surgeries | Sakshi
Sakshi News home page

కట్టుకట్టి వదిలేశారు

Nov 14 2024 5:11 AM | Updated on Nov 14 2024 5:11 AM

Doctors are connecting with Arogyashri even for minor surgeries

మిగతా వైద్యానికి ఆరోగ్యశ్రీ అనుమతులొచ్చే వరకూ ఆగాల్సిందే! 

యాక్సిడెంట్‌ బాధితుడికి చికిత్స చేయడంలో జాప్యం  

మైనర్‌ సర్జరీలకు సైతం ఆరోగ్యశ్రీతో ముడిపెడుతున్న వైద్యులు 

రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వింత పరిస్థితులు 

సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన రమేశ్‌ సోమవారం బైక్‌పై వెళుతుండగా యాక్సిడెంట్‌ అయింది. దీంతో ముఖంపై తీవ్ర గాయం అయింది. వైద్యం కోసం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా, విజయవాడ ప్రభు­త్వా­స్పత్రికి రెఫర్‌ చేశారు. రమేశ్‌ అదేరోజు జీజీహెచ్‌లో అడ్మిట్‌ అయ్యారు. ముఖంపై అయిన గాయానికి వైద్యులు కట్టు కట్టారు. తదుపరి చికిత్స అందించాలంటే ఆరోగ్యశ్రీ కింద కేసులు రిజిస్ట్టర్‌ చేసి, అను­మతులు వచ్చేవరకూ ఆగాలన్నారు. 

కుటుంబ సభ్యుల నుంచి సిబ్బంది ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని కేసు రిజిస్టర్‌ చేస్తున్నామని చెప్పారు. ఆ రోజు నుంచి బుధ­వారం వరకు మూడురోజుల పాటు అనుమతులు రాలేదని చికిత్సలో జాప్యం చేస్తూ వచ్చారు. ‘చిన్న గాయానికి చికిత్సకోసం మూడురోజుల నుంచి ఎదురుచూ­స్తు­న్నాం. ఇంకెన్ని రోజులు పడుతుందని ప్రశ్నిస్తే.. ఏమో చెప్పలేం.’ అని సిబ్బంది సమాధానం ఇస్తున్నారని రమేశ్‌ కుమారుడు వాపోయాడు. 

రమేశ్‌ తరహాలోనే చికిత్సల్లో జాప్యంతో ఏపీవీవీపీ, బోధనాస్పత్రుల్లో నిరంతరం పలువురు ఇబ్బం­దులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆస్ప­త్రుల్లో చికిత్సల కోసం డబ్బు ఖర్చుపెట్టే స్తోమతలేక ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయి­స్తున్న నిరుపేద రోగులకు తక్షణమే వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్యశ్రీ నుంచి అనుమతులు రావాలంటూ రోజుల తరబడి ఆస్పత్రుల్లో వేచి ఉండేలా చేస్తున్నారు. మైనర్‌ సర్జరీలకు సైతం ఆరోగ్యశ్రీ కార్డు కావాలని ఆస్ప­త్రుల్లో డిమాండ్‌ చేస్తున్నారు. 

సాధారణంగా ప్రభు­త్వా­స్పత్రులంటే ఎటువంటి షరతులు లేకుండా తక్షణ వైద్యం అందుతుందని ప్రజలకు నమ్మకం. ప్రస్తుత ప్రభుత్వంలో ఇందుకు భిన్నంగా ఆస్పత్రుల్లో పరిస్థి­తులు ఉంటున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement