60.95 లక్షలమందికి నేడు పింఛన్ల పంపిణీ | Distribution of pensions to above 60 lakh people today | Sakshi
Sakshi News home page

60.95 లక్షలమందికి నేడు పింఛన్ల పంపిణీ

Jul 1 2021 2:26 AM | Updated on Jul 1 2021 3:41 AM

Distribution of pensions to above 60 lakh people today - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 60.95 లక్షలమంది వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రభుత్వం గురువారం పింఛన్లు పంపిణీ చేయనుంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు పంపిణీ చేయనున్నారు.

ఇందుకోసం రూ.1,484.96 కోట్లను అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు వలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. 13 జిల్లాల్లోని డీఆర్‌డీఏ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన జిల్లా కాల్‌ సెంటర్ల ద్వారా ఈ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement