ఈడుపుగల్లులో అధికారుల చర్యలపై వివాదం | Controversy over officials actions in Edupugallu | Sakshi
Sakshi News home page

ఈడుపుగల్లులో వైసీపీ నేతలపై వివక్షత చూపుతున్న అధికారులు

Apr 1 2026 11:49 PM | Updated on Apr 1 2026 11:53 PM

Controversy over officials actions in Edupugallu

సాక్షి, కృష్ణాజిల్లా: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ పనుల పేరుతో అధికారులు చేపట్టిన చర్యలు వివాదాస్పదంగా మారాయి.  

ఘటన వివరాలు.. NHAI అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి వైసీపీ సానుభూతిపరుల షాపుల ముందు JCB తో గండ్లు పెట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ధ్వంసం చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. రహదారి పక్కన ఉన్న ఇతర షాపులను మాత్రం తొలగించకపోవడం వివక్షత ఆరోపణలకు దారితీసింది.  

దాంతో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా పడేస్తారు? అని ప్రశ్నించారు. మచిలీపట్నం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఇలాగే పడేస్తారా? అంటూ నిలదీశారు. రహదారి అటువైపు ఉన్న షాపులు ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు చెందిన షాపులపై అధికారులు జంకుతున్నారా అని కూడా ప్రశ్నించారు.  

వైసీపీ నేత చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement