సాక్షి,విజయవాడ: టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ప్రభుత్వం తాము చేస్తున్న ఒత్తిడి కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 4న (శనివారం) వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్రంలోని దేవాలయాలు పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో మల్లాది విష్ణుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.
టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. బీఆర్ నాయుడు అసాంఘిక , అనైతిక చర్యల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. నెలరోజులైనా బీఆర్ నాయుడితో రాజీనామా చేయించడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. కోట్లాది మంది భక్తులు వచ్చే ఆలయ ఛైర్మన్ ఎంత నిష్టగా ఉండాలి. బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా?. లేదంటే చంద్రబాబు చెబితే బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకూ ఒత్తిడి తెస్తాం. టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు కొనసాగడాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుపడుతోందన్నారు.


