సాక్షి, తాడేపల్లి: గుడ్ ఫ్రైడే సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందేశం ఇచ్చారు. ‘‘మానవాళి కోసం జీసస్ మహాత్యాగం చేశారు. కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు..
..మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్ ఇచ్చిన సందేశాలు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Christ’s crucifixion stands as the ultimate example of love, compassion, and sacrifice. On this Good Friday, let us pause to reflect, look within, and renew our values, guided by His simple yet profound teaching: to love one another as we love ourselves.#GoodFriday
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2026
వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
వైఎస్ జగన్‌ను క్రైస్తవ మత పెద్దలు కలిశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా జగన్‌కు ఆశీర్వాదాలు ఇచ్చారు. మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలంటూ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, బొల్లవరపు జాన్ వెస్లీ, వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్, ఆర్చ్ బిషప్ ఎన్‌జెఎస్‌డి రాజు -ఇండియన్ క్రిస్టియన్ మిషన్, బిషప్ సంజీవరావు - బైబిల్ మిషన్, బిషప్ సైమన్ సీజర్ - మెట్రోపాలిటన్ చర్చెస్, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.


