‘వైఎస్‌ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్’ | Public Discussion On Ys Jagan Mavigan Proposal: Kasu Mahesh Reddy | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్’

Apr 2 2026 4:24 PM | Updated on Apr 3 2026 12:58 PM

Public Discussion On Ys Jagan Mavigan Proposal: Kasu Mahesh Reddy

సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్‌ ‘మావిగన్‌’ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ గ్రోత్ ఇంజిన్‌లా పని చేస్తుందన్నారు. గుంటూరు నుండి మచిలీపట్నం వరకు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. భూముల రేటు పెరుగుతుంది. అది ప్రజలకే‌ ఉపయోగం. అమరావతి వలన కేవలం చంద్రబాబు, ఆయన బినామీలకే లాభం. రాష్ట్రం ఆర్థికంగా‌ ఇబ్బందులు పడుతుంది’’ అని కాసు మహేష్‌రెడ్డి వివరించారు.

‘‘చంద్రబాబు అమరావతి కంటే ముందు నూజివీడు, గన్నవరం అంటూ రకరకాల పేర్లు ఎందుకు చెప్పారు?. తమ వారు అమరావతిలో భూములు కొన్నాక అమరావతిని రాజధానిగా ప్రకటన చేశారు. వైఎస్‌ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ ఒక గ్రోత్ ఇంజిన్‌లా ఉంటుంది. మచిలీపట్నం పోర్టు రాకతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. చంద్రబాబు అమరావతి నిర్మాణాల పేరుతో రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టారు.

..వైఎస్‌ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్ తిన్నారు. ప్రజల నుండి జగన్ ప్రతిపాదనకి మంచి సపోర్ట్ వస్తోంది. అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. చదరపు అడుగు రూ.4 వేలు అయ్యేదాన్ని రూ.14 వేలకు పెంచారు. ఇందులో చంద్రబాబు, ఇతర మంత్రులు పొందుతున్న ముడుపులు ఎంత?. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలిసి విశ్వనగరంగా మారుతుంది.

జగన్ పై కోపంతో ప్రజల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు

..అమరావతిలో సొంత భూములకు ధర పెంచుకోవటానికే రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైఎస్‌ జగన్ ప్రతిపాదనపై చర్చ జరగాలి. మావిగన్ అనేది ఒక సూచన మాత్రమే. రాజధాని పేరు మీద చర్చించాలి గానీ ట్రోల్స్ చేస్తే ఏం లాభం?. రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే రాజధానిని రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవసరమా?. దీనిపై ప్రజలే ఆలోచించు కోవాలి. చంద్రబాబు తొలుత సమైక్యాంధ్ర అన్నారు. ఆ తర్వాత తెలంగాణ కోసం లేఖ రాశారు. రెండు నాల్కల ధోరణి చంద్రబాబుదే’’ అని కాసు మహేష్‌రెడ్డి దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement