వైఎస్‌ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు | YS Jagan Receives Easter Blessings From Christian Religious Leaders, Photos Viral On Social Media | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు

Apr 2 2026 5:27 PM | Updated on Apr 2 2026 5:49 PM

Christian Religious Leaders Blessed Ys Jagan

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని క్రైస్తవ మత పెద్దలు కలిశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు ఆశీర్వాదాలు ఇచ్చారు. మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలంటూ ప్రార్థనలు చేశారు.

కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు బొల్లవరపు జాన్‌ వెస్లీ, వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్‌ సెల్ ప్రెసిడెంట్‌, ఆర్చ్‌ బిషప్‌ ఎన్‌జెఎస్‌డి రాజు -ఇండియన్‌ క్రిస్టియన్‌ మిషన్‌, బిషప్‌ సంజీవరావు - బైబిల్ మిషన్‌, బిషప్‌ సైమన్‌ సీజర్‌ - మెట్రోపాలిటన్‌ చర్చెస్‌, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement