తాడేపల్లి: నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ ఎన్నికపై వైఎస్ జగన్ నాయకత్వం, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, న్యాయవాదుల సంక్షేమం, న్యాయ వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.

వైఎస్ జగన్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని, న్యాయ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అలాగే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంలో బార్ కౌన్సిల్ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.


