సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన

CM YS Jagan YSR Kadapa Visiting Schedule Over YSR Death Anniversary - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు, ఎల్లుండి(రెండు రోజులు) వైఎస్సార్‌ కడప జిల్లాను పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ నివాళులు అర్పించనున్నారు.(భూమనను ఫోన్‌లో పరామర్శించిన సీఎం జగన్‌)

సీఎం వైఎస్‌ జగన్‌ జిల్లా పర్యటన షెడ్యూల్‌..
మొదటి రోజు: 01-09-2020 (మంగళవారం):

  • సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడప బయలుదేరనున్నారు.
  • సాయంత్రం 4. 45 గంటలకు కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకోనున్నారు.
  • సాయంత్రం 5.15 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ ఎస్టేట్‌ చేరుకోని సీఎం జగన్‌ అక్కడే రాత్రి బస చేస్తారు.

రెండో రోజు: 02.09.2020 (బుధవారం): 

  • ఉదయం 09.45 గంటల నుంచి 10.30 వరకూ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్నారు.
  • మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు. 

తాడేపల్లి: సెప్టెంబర్ 2వ తేదీన స్వర్గీయ డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దివంగత మహానేత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను అన్ని వర్గాల ప్రజలు స్మరించుకునే విధంగా సెప్టెంబర్ 2న నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిలలో ఉదయం 9గంటలకు నివాళులు అర్పించాలని సూచించారు.

అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులని సమన్వయ పరుచుకొని పలు సేవా కార్యక్రమములు నిర్వహించాలని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నూతనంగా రంగులు వేయించి, పూల‌తో అలంకరించాలన్నారు.  కరోనా నిబంధనలు పాటించి కార్యక్రమాలు నిర్వ‌హించాలని చెప్పారు. పార్లమెంట్‌, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులకు ఆయన సూచనలు ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top