‘జగనన్న విద్యా కానుక’ ప్రారంభించిన సీఎం జగన్‌

CM YS Jagan Visits East Godavari To Launch 2nd Phase Manabadi Nadu Nedu - Sakshi

అప్‌ డేట్స్‌: మనబడి నాడు-నేడు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బె​స్ట్‌’ అని రాసి సీఎం జగన్‌ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హైస్కూల్‌ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..  పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఐసీఎంఆర్‌, డబ్ల్యూహెచ్‌ కూడా స్కూళ్లు తెరవాలని సూచించారని, కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్‌ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించామని, పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు 'జగనన్న విద్యాకానుక' కింద బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, డిక్షనరీ ఇస్తున్నామని పేర్కొన్నారు. 


►  పి. గన్నవరం హైస్కూల్‌ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ.. స్కూళ్లల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. నాడు-నేడుతో కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను రూపొందించామని పేర్కొన్నారు. 

మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ స్కూళ్ల రూపురేఖలు మార్చారని, పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారని తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించామని చెప్పారు.  తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాల అభివృద్ధి చేశామని, రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బె​స్ట్‌’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్‌ విద్యార్థులతో మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న పలు సౌకర్యాలను సీఎం జగన్‌కు వివరించారు.

ప్రస్తుతం స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా విద్యార్థులను అడిగి తెలసుకొని.. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్‌ బ్యాగ్‌ను భుజనా వేసుకొని మరీ సీఎం జగన్‌ పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించిన ‘మెనూ’ను సీఎం జగన్‌ పరిశీలిచారు. అనంతరం ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలన్‌ ఆవిష్కరించి సీఎం జగన్‌ ప్రారంభించారు.

‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైఎస్‌ జగన్‌ వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో సీఎం జగన్‌ ప్రారంభించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top