స్వదేశం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan Returns India From Davos Tour - Sakshi

దావోస్‌ వేదికగా వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరమ్‌ సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. కాగా, దావోస్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం జగన్‌, మంత్రుల బృందం మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు గన్నవరం విమానాశ‍్రయంలో ప్రజా ప్రతినిధులు, ఉన్నాతాధికారులు స్వాగతం పలికారు. 

ఇక, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు సీఎం జగన్‌ నేతృత్వంలో రాష్ట్రం దావోస్‌ వేదికగా చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా  వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు,  పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు.  

ఇది కూడా చదవండి: దావోస్‌లో ఏపీ ధగధగ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top