విభజన సమస్యలు పరిష్కరించండి: సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan To Meet Amit Shah In Delhi - Sakshi

కేంద్ర హోంమంత్రికి సీఎం జగన్‌ విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య విభ­జన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి ఆయన హోం మంత్రి నివా­సంలో అమిత్‌ షా తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు.  తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ పరిష్కారం కాని పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజె­క్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపేలా చూడాలని కోరారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య అపరి­ష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్క­రించాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఏపీ భవన్‌ సహా షెడ్యూల్‌ 9, 10 ఆస్తుల విభజ­నపై కూడా చర్చించారు. తెలంగాణ ప్రభు­త్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకా­యిల అంశాన్నీ హోం మంత్రి దృష్టికి తెచ్చారు. ఏపీ విద్యుత్‌ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరి­గణనలోకి తీసుకుని, వెంటనే ఈ బకా­యిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.   
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top